Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెచ్1బి వీసాదారులపై మరో పిడుగు

హెచ్1బి వీసాదారులపై మరో పిడుగు

వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న నిపుణుల కుటుంబాలకు ట్రంప్ ప్రభు త్వం మరో షాక్ ఇవ్వనుందా? హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ప్రస్తుతం లభిస్తున్న హెచ్-4 వర్క్ పర్మిట్ కార్యక్రమాన్ని రద్దు చేసే దిశ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోం ది.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ని పుణుల కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాము లు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసేందు కు 'ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)'పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం అర్హ త ఉన్న హెచ్-4 వీసాదారులు ఈడీ పొందిన తర్వాత అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయవచ్చు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాముల్లో హెచ్-4 వీసా ప్రముఖంగా ఉంది. 2014 నుంచి 2017 మధ్య హెచ్-4 ఈఏడీలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. 93 శాతం దరఖాస్తులు భారతీయులవే కాగా,వారిలో 94 శాతం మంది మహిళలే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

హెచ్-4 వర్క్ పర్మిట్ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) తీసుకొచ్చింది. హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడిన హెచ్-4 జీవిత భాగస్వాములను ఉద్యోగ అనుమతికి అర్హులైన విదేశీయుల వర్గం నుంచి తొలగించడం పేరుతో ఈ ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వెబ్‌సైట్ రెజిన్‌ఫోలో పొందుపరిచారు. దీనికి ఆర్‌ఐఎన్: 1615- ఏడీ14 కేటాయించారు. అయితే దీనిని ఎప్పుడు అధికారికంగా విడుదల చేస్తారన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదే సమయంలో హెచ్-1బీ వీసా ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే ప్రయత్నాలను కూడా ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.

కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే హెచ్-1బీ నిపుణులకు 1,03,265 డాలర్ల కొత్త రుసుము విధించే ప్రతిపాదనను డీహెచ్‌ఎస్ ఇటీవల తీసుకొచ్చింది. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ నిపుణులు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును తొలగించే ప్రతిపాదనకు కూడా వైట్‌హౌస్ ఆమోదం తెలిపింది. అయితే హెచ్-4 వర్క్ పర్మిట్లను రద్దు చేసే ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందుగా 'ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదిత నిబంధనపై నోటీసు (ఎన్‌పీఆర్‌ఎం)'ను ప్రచురించాలి. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. అనంతరం తుది నిబంధనను ప్రకటించాలి. అప్పటివరకు చెల్లుబాటు అయ్యే ఈఏడీలు కలిగిన అర్హత ఉన్న హెచ్-4 జీవిత భాగస్వాములు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కొనసాగించవచ్చు.

వెంటనే హెచ్-4 వర్క్ పర్మిట్ రద్దవుతుందా?

లేదు. ప్రస్తుత ప్రతిపాదన వెంటనే హెచ్-4 ఉద్యోగ అనుమతిని రద్దు చేయదు. హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడిన కొంతమంది హెచ్-4 జీవిత భాగస్వాములను ఉద్యోగ అనుమతికి దరఖాస్తు చేసుకునే అర్హత ఉన్న విదేశీయుల వర్గం నుంచి తొలగించాలన్నదే డీహెచ్‌ఎస్ ప్రతిపాదన. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను వెనక్కి తీసుకోవడమే తాజా ప్రతిపాదన లక్ష్యం. 2015 మే 26 నుంచి అమల్లోకి వచ్చిన ఆ నిబంధనతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న హెచ్-1బీ నిపుణుల అర్హత ఉన్న జీవిత భాగస్వాములకు ఈఏడీ పొందే అవకాశం కల్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu