Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇడ్లీ పిండిలో విషం..... ప్రియుడితో కలిసి భర్త హత్య!

ఇడ్లీ పిండిలో విషం..... ప్రియుడితో కలిసి భర్త హత్య!

కర్ణాటకలో కలకలం రేపిన ఘటన.. భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్**

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: కుటుంబ బంధాలను దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

భర్తకు ఇచ్చే ఇడ్లీ పిండిలో విషపూరిత ఉమ్మెత్త విత్తనాల పొడిని కలిపి, అనంతరం ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది. ఈ కేసులో భార్యతో ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుణసూరులోని వినోబా కాలనీకి చెందిన రామప్రసాద్ (35) అనే వ్యక్తి తన భార్య పవిత్ర (30) కలిసి ఉంటున్నాడు.

ఆమెకు సునీల్ (30) అనే యువకుడు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండ్లీ పిండిలో ఉమ్మెత గింజలు పొడిని కలిపారు. అక్టోబర్ 16న రామ ప్రసాద్ మద్యం తాగొచ్చి ఇడ్లీలు తిని పడుకున్నాడు.

ఇడ్లీలు తిన్న తరువాత చనిపోవడంతో తన ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి భార్య హత్య చేసింది. తన భర్త నిద్ర నుంచి లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. భర్తకు ముందు రోజు రాత్రి పెరుగు అన్నం పెట్టానని, మరుసటి రోజు ఉదయం నిద్రలేవకపోవడంతో పరిశీలించగా స్పందించలేదని పవిత్ర పోలీసులకు తెలిపింది. రామప్రసాద్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతడి సోదరుడు చంద్రహాస్ అక్టోబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన సోదరుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితులు, పరిచయాలు, ఇతర వివరాలపై పోలీసులు ఆరా తీశారు. పవిత్రకు సునీల్‌తో సంబంధం ఉందనే ప్రచారం స్థానికంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే రామప్రసాద్ మృతి గురించి సునీల్ తన పరిచయస్తుల వద్ద మాట్లాడినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. శవ పరీక్షలో సహజమరణం కాదని తేలడంతో పోలీసులు భార్యతో పాటు ప్రియుడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu