Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇజ్రాయెల్‌లో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌లో భారతీయుడు మృతి

జెరూసలేం: ఓ భారతీయుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐలాట్ నగరంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు.

తన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రక్తస్రావంలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం భారతీయుడిగా గుర్తించారు. 31 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడికి, నిందితుడి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu