Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇప్పుడు తరానికి వైసిపి హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయి: చంద్రబాబు

ఇప్పుడు తరానికి వైసిపి హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయి: చంద్రబాబు

మరావతి: రోజు రోజుకు మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిలో అసహనం పెరుగుతోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సైకో అంటే గొడ్డలి పార్టీ అని ప్రజలు గుర్తించారని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు కూడా కొన్ని తెలియవని, ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయని తెలియజేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలుస్తున్నాయని, అసలు ప్రజాస్వామ్యానికి వీళ్లు ఎలా ఫిట్ అవుతారు?అని హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పాలించవచ్చు కానీ, బాధితులు జిల్లా రాజకీయాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. వైఎస్ సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని, తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు కుమార్తెకు ఉంది కదా! అని సునీత పోరాటం వల్లే ఇప్పటికీ వివేకా హత్యకేసు సజీవంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న తరానికి కూడా వీరి హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయని, ఇప్పుడు జగన్ కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందని చంద్రబాబు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu