అమెరికా: ఇరాన్‌పై మరోసారి దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం నాటికి ఒప్పందం కుదరవచ్చని అన్నారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానమిచ్చారు. అయితే, ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా ఆ దేశం దానికి కట్టుబడి ఉంటుందా లేదా అన్నదే ప్రధాన సందేహమని వ్యాఖ్యానించారు. గతంలో బి-2 బాంబర్లతో చేపట్టిన ఆపరేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ట్రంప్ ఆరోపించారు. సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించాల్సి ఉన్నందునే ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దాడుల అవకాశాలను తెరిచి ఉంచుతూనే దౌత్యపరమైన చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ట్రంప్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

