Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైస్వాల్ డకౌట్... భారత్ 80/2

జైస్వాల్ డకౌట్... భారత్ 80/2

గాలే: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

ఇప్పటికే భారత జట్టు 258 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 35 పరుగులు చేసి ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో మిలాన్ రతేనాయక్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో దేవ్‌దూత్ పడిక్కల్(35), శుభ్‌మన్ గిల్(07) బ్యాటింగ్ చేస్తున్నారు. నాలుగు వందల పరుగుల ఆధిక్యం ఇచ్చి డిక్లేర్డ్ చేస్తే బాగుంటుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్: 462

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 284

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu