Dailyhunt
'జన నాయగన్' విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్

'జన నాయగన్' విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్

చెన్నై: సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీని స్థాపించిన ఆయన త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.

ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు.

అయితే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. అయితే తన సినిమా విడుదల కాకుండా కుట్రలు జరుగుతున్నాయని విజయ్ ఆరోపించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.

''కరూర్ ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారు. మీకు న్యాయం కోసం నేను ఎలా అయితే కోరుతున్నానో.. నాకు కూడా న్యాయం కావాలని కోరుతున్నా'' అని విజయ్ అన్నారు. ఎల్పిజి సిలిండర్ల కొరతపై స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ''తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర సిఎం స్టాలిన్ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఎల్పిజి సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లరా?'' అని విజయ్ ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu