Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జపాన్‌లో భారత్ మామిడి నిషేధం

జపాన్‌లో భారత్ మామిడి నిషేధం

భారతదేశపు మామిడి పండ్ల దిగుమతిని జపాన్ ఈ ఏడాది మామిడి సీజన్‌లో నిలిపివేసింది. 20 ఏండ్లలో తొలిసారిగా భారతీయ మధుర ఫలాలపై జపాన్ నిషేధం అమలులోకి వచ్చింది.

జపాన్ ఈ కఠోర నిర్ణయానికి తీసుకోవడం వెనుక కారణం ఉంది. భారతదేశంలో పండ్ల చెట్లకు తెగుళ్ల నివారణ చర్చలలో నిర్లక్షం, తప్పిదాలు ఉన్నట్లు జపాన్ అధికారులు గుర్తించారు. ఇటువంటి పండ్లు తమ దేశంలోకి వస్తే తమ దేశీయ వ్యవసాయ రంగానికి ఇక్కట్లు ఏర్పడుతాయని నిర్థారించారు. భారత్‌లోని ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఈ ఏడాది ఆరంభంలో జపాన్ బృందాలు తనిఖీలు చేశాయి. భారత్ నుంచి ఈ వేసవిలో మామిడి దిగుమతిని నిలిపివేశారు. ఈ క్రమంలో భారతీయ మామిడి రకాలు అల్ఫ్‌న్సో, లంగ్రా, బంగన్‌పల్లి మామిడి పండ్ల మార్కెట్‌కు జపాన్‌లో బ్రేక్ పడింది. దీనితో ఈ రకం పండ్ల తోటల వ్యవసాయదారులు ఉసూరుమంటున్నారు. వీరి లాభాలకు గండిపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu