Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కాకా'లో అమ్ములుగా...

'కాకా'లో అమ్ములుగా...

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం 'కాకా'తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను హై -ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఆమె సింపుల్ లుక్ పోస్టర్‌కు ఎంతో సహజమైన ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రకు తగ్గట్టుగా ఉంది. అనస్వరను మేకర్స్ హార్ట్ ఆఫ్ కాకాగా... ఆమె పాత్రను అమ్ములు పాపగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. 'కాకా' 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu