గ్లాస్గో: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం లో ఆరంభోత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి.
పోటీలను బ్రిటన్ రాజు కింగ్ చార్లె స్ 111 అధికారికంగా ప్రారంభించారు. గ్లాస్గోలోని ఓవో హైడ్రోలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్‌షో, సాంస్కృతిక, సాహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ స్లైక్టిస్ట్ క్రిస్ హోయ్‌తో పాటు డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్‌తో పాటు రాణి కామిలా ప్రవేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటి టన్‌స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఆమెతో పాటు కాల్లమ్ బిటి, నీనా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేశారు. ఈ పోటీల్లో భారత్‌తో సహా 74 దేశాలు పోటీ పడుతున్నాయి. దాదాపు 3వేల మంది అథ్లెట్‌లు ఇండోర్ పరేడ్‌లో ఆఫ్ నేషన్స్‌లో పాల్గొన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్ర మం పూర్తిగా ఓ భవనం లోపల జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆరంభోత్స వేడుకల్లో పాల్గొన్న భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గొహెన్ సారథ్యం వహించారు. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత్‌కు చెందిన కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి.

