హైదరాబాద్: రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల కళ్ల నుంచి రక్తం కారుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో అందరకీ అన్యాయం జరిగిందని అన్నారు.
అంబర్ పేటలో బిఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ మీటింగ్ లో ధాన్యంపై కనీసం చర్చ జరగలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ పెడతామని తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తానా అంటే సిఎం రేవంత్ రెడ్డి తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. కొందరు ఓట్లు తీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని 'సర్' పై అందరు అలర్ట్ గా ఉండాలని సూచించారు. శనివారం, ఆదివారం వస్తే హైడ్రా వచ్చి పేదల ఇళ్లు కూల్చుతోందని, కాంగ్రెస్ ను మూసీలో కలపాలని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు పీకల వరకు కోపం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.

