No Alliance With Any Political Party Says RS Praveen Kumar
కాంగ్రెస్ పందికొక్కులు, రాబందుల చేతిలో తెలంగాణ బందీ అయిందని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంబర్‌పేటలో సిఎం రేవంత్‌రెడ్డి మరోసారి బజారు భాష మాట్లాడారని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ పాలిట నంది అని, అన్నింటినీ తట్టుకుని ప్రాణ త్యాగానికి సిద్దపడి కెసిఆర్ తెలంగాణ తెచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలూ పందికొక్కులా.. పందులా ప్రజలు డిసైడ్ చేస్తారని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తన చేతిలో మోసపోవాలని కోరుకుంటారబి రేవంత్ రెడ్డి ఎపుడో చెప్పారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులను తిట్టేందుకే రూ.15 కోట్ల ప్రజాధనంతో సభ పెట్టుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ వెయ్యి రోజుల పాలనను వెయ్యి రోజుల పీడన,వెయ్యి రోజుల వంచనగా అభివర్ణించారు.
కెటిఆర్ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నాయని తెలిపారు. ఛార్జీషీట్ కాంగ్రెస్ నేరస్థుల మీద వేస్తున్నామని, ఇది ప్రిలిమినరీ ఛార్జీషీట్ మాత్రమే అని పేర్కొన్నారు. కెటిఆర్ ఇచ్చిన పిలుపులో రాజ్యాంగాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని, ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని వివరించారు. మిర్యాలగూడలో 3వ తేదీన కెటిఆర్ సభకు అనుమతి ఎందుకు నిరాకరించారు..? అని ప్రశ్నించారు. అక్కడ సెక్షన్ 30 ఎందుకు పెట్టారు..? అని అడిగారు. హై కోర్టుకు వెళితే గానీ సరూర్ నగర్ సభకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. డిజిపి క్రికెట్‌లో సెంచరీ కొట్టారని, తప్పుల్లో సెంచరీ కొట్టొద్దని సూచించారు. ఏవైనా మత పరమైన ఊరేగింపులు ఉంటే తప్ప సెక్షన్ 30 పెట్టరు అని చెప్పారు. 33 నెలలుగా రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ అమల్లో ఉందని అన్నారు.

