కోల్ కతా: బాలికకు మత్తు మందు కలిపిన చాక్లెట్ ఇచ్చి అనంతరం కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని సర్ సునా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బెహలా ప్రాంతంలో ఓ బాలికకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్త కారులో లిఫ్ట్ ఇచ్చారు.అప్పటికే కారులో బాలిక స్నేహితురాలు కూడా ఉన్నారు. కారులో ఎక్కిన తరువాత బాలికకు మత్తు మందు కలిపిన చాక్లెట్ ఇచ్చారు. బాలిక స్పృహకోల్పోయిన తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం బాలికపై సామూహిక అత్యాచారం పాల్పడడంతో వీడియోలు రికార్డు చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని నిందితులు బాలికను బెదిరించారు. బాలిక ఘటన జరిగిన రెండు రోజుల తరువాత తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

