ముంబయి: కారులో పది అడుగుల కొండచిలువ కనిపించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని దహిసర్ పశ్చిమలోని కందర్పాడ ప్రాంతంలో జరిగింది. బాపు బాగ్వే రోడ్డుకు సమీపంలోని మహేశ్వర్ భవన్ ప్రాంతంలో సన్నీ కాంబ్లే సోదరి కారులో పాము కదులుతున్నట్టు స్థానికులు గుర్తించారు.
వెంటనే స్నేక్ స్నాచర్‌కు సమాచారం ఇచ్చారు. రెస్కూ ఆపరేషన్ నిపుణులు సమీర్ ఘటనా స్థలానికి చేరుకొని బానెట్ ఓపెన్ చేశాడు. ఏడు అడుగుల కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. వెంటనే నెమ్మదిగా కారు ఇంజన్‌లో నుంచి కొండచిలువను బయటకు తీసి అనంతరం సంచిలో బందించాడు. కారులో ఇంజన్ వల్ల పాముకు గాయాలయ్యాని వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చాడు. పాముకు ఎటువంటి గాయాలు కాలేదని ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. సంజయ్‌గాంధీ జాతీయ పార్కులో పామును వదిలిపెట్టారు. అంత పెద్ద పాము జనవాసలోకి ఎలా వచ్చిందని స్థానికులు వాపోతున్నారు.

