Dailyhunt
'కందుల సులోచన రాణి'గా అనుపమ...

'కందుల సులోచన రాణి'గా అనుపమ...

చార్మింగ్ స్టార్ శర్వా... దర్శకుడు సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్ -ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె.

రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ 'కందుల సులోచన రాణి'గా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటోంది. గంగా అనే తుఫాన్‌లాంటి పాత్రకు ఆత్మలా నిలిచే సులోచన ఈ కథలో కీలక పాత్రగా ఉండనుంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో నెక్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'భోగి' చిత్రం రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu