Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్నాటకలో విద్యార్థులకు ఉచితబస్సు ప్రయాణం

కర్నాటకలో విద్యార్థులకు ఉచితబస్సు ప్రయాణం

బెంగళూరు ః కర్నాటకలో కొత్త ముఖ్యమంత్రి డికె శివకుమార్ సారధ్య మంత్రి మండలి బుధవారం తొలిసారిగా సమావేశం అయింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

సమావేశం తరువాత ముఖ్యమంత్రి విలేకరులకు తెలియచేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, కన్నడిగులకు ఉద్యోగాల కల్పన పథకం తీసుకువచ్చారు. దీని మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలలో యువతకు ఉద్యోగాలు భర్తీ చేయిస్తారు. రాష్ట్రంలో స్కూలు నుంచి పిజి స్థాయి వరకూ అందరు విద్యార్థులకు ఇక ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుంది.

ఇక కన్నడ యువత ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాల కోసం తమ అర్హతలతో ప్రభుత్వ సంబంధిత విభాగాలకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేటు రంగంలో కన్నడ కోటా అమలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని వివరించారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో రోడ్ల మరమ్మతులు , విస్తరణ పనులకు రూ 2000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు డికె తమ కేబినెట్ తొలి భేటీ నిర్ణయాలను వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu