Fire Accident
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగరబత్తి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇదే ఫ్యాక్టరీలో శ్రీలక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లు కూడా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. యజమాని ఘటనా స్థలానికి చేరుకొని కన్నీంటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

