Dailyhunt
కర్రెగుట్టల్లో కొత్త వెలుగు

కర్రెగుట్టల్లో కొత్త వెలుగు

న తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోని గిరిజన గూడేల ప్రజలకు భోరోసా కల్పించేందుకు ప్రభుత్వం తరపున పోలీసులున్నారని తెలిపేందుకే కర్రెగుట్టల ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.

మంగళవారం ములు గు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరులోని కర్రెగుట్టలలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ, అదనపు డీజీపీ ఆపరేషన్స్ అని ల్ కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజ య్ కుమార్‌లతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వం దనం స్వీకరించారు. అనంతరం పోలీస్ ఔట్ పోస్ట్, ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్‌కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పామునూరు ప్రజల కోసం

ఏర్పాటుచేసిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నాక గిరిజన ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వెంకటాపురం మండలం ముర్మూరులోని రాష్ట్ర రహదారి కలుపుకొని పామునూరు దాకా మొదటి దశ 8.07 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పామునూరు నుంచి తలపాల గుండా డోలి వరకు రెండవ దశ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం పామునూరులో 7 కుటుంబాలు, 22 మంది సభ్యులు జీవనం కొనసాగిస్తున్నారని వారికి సీఆర్పీఎఫ్ పోలీసులు భరోసా కల్పిస్తున్నారన్నారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ సమన్వయంతో కర్రెగుట్టల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.

ఉద్యమంలో మరో ఆరుగురు నక్సల్స్

నక్సల్స్ విముక్తి ప్రాంతంగా తెలంగాణ ఏర్పడిందని, ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోగా ఇంకా ఆరుగురు నక్సల్స్ మిగిలి ఉన్నారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆరోగ్య సమస్యల కారణంగా బయటికి రావడం లేదన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ.. కర్రెగుట్టల ప్రాంతంలో జలపాతం, టూరిజం ప్రదేశాలున్నాయని వాటిని ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. డీజీపీ రాక సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్‌రామ్ నాథన్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్బీ ఐజీ సుమతి, కాళేశ్వరం సీసీఎఫ్ ప్రభాకర్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్, పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu