Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళలో భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి పడి ముగ్గురి మృతి

కేరళలో భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి పడి ముగ్గురి మృతి

కొచ్చి: కేరళ లోని కేరళ, ఇడుక్కి,కొట్టాయం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి ముగ్గురు మరణించారు. వాగమాన్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఒకరు మరణించారు.

ప్రభాకరన్ నాయర్ అనే అతని మృతదేహం ఇంకా లభించలేదు. ఇడుక్కి జిల్లా లోని ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.

పూంజార్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడటంతో ఇల్లు పూర్తగా ధ్వంసమై ఇద్దరు చిక్కుకున్నారు. రాష్ట్రం లోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. 183 జాతీయ రహదారి పై వంది పెరియార్ ప్రాంతం జలమయమైంది. ఎరాట్టుపేట, కంజిరాపల్లి, కూట్టిక్కల్, ఎరమెలి వంటి అనేక పట్టణాలు నీట మునిగాయి. వయనాడ్‌తో సహా అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu