ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాక్ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరకే 28 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో వినియోగదారులు అపరిమిత కాలింగ్, డేటాతో సహా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
కంపెనీ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.51 ధరతో వస్తోన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ఏకంగా 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ సరసమైన ప్లాన్ ప్రత్యేకంగా కంపెనీ నెట్‌వర్క్‌లో చేరాలనుకునే వినియోగదారుల కోసం రూపొందించినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 51 ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే, యూజర్లు ప్రతిరోజూ 2GB డేటా, 100 ఉచిత SMSలను పొందుతారు. దేశం అంతటా అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు కొత్త సిమ్ కార్డ్ ఉచితంగా పొందవచ్చు. కాగా, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కస్టమర్ల సంఖ్య పెంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

