చాలామంది రీఛార్జ్ ప్లాన్స్ ఖరీదైనవిగా మారుతున్న క్రమంలో సరసమైన ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తుంటే, మీకో గుడ్ న్యూస్! కేవలం రూ.200 ధర లోపు 28 రోజుల వ్యాలిడిటీతో ఒక గొప్ప ప్లాన్ అందుబాటులో ఉంది.
తక్కువ డేటా వినియోగించేవారి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అంతేకాదు, తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.199 రీఛార్జ్ ప్లాన్
రూ.199 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 2GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో లభించే 2GB డేటాను ఒకేసారి లేదా 28 రోజులలో క్రమంగా ఉపయోగించుకోవచ్చు. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, రూ.200 కంటే తక్కువ ధరకే లభించే ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ 12 నెలల వ్యాలిడిటీతో రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంతో సహా ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లలోని మోసపూరిత లింక్‌లను బ్లాక్ చేయడంతో పాటు, రియల్-టైమ్ అలర్ట్‌లను కూడా అందిస్తుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి ఉచితంగా హలోట్యూన్ అందిస్తుంది. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ద్వారా కంపెనీ ఉచిత కంటెంట్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

