Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖతార్ గగనతలంలో అమెరికా గ్యాస్ స్టేషన్ మిస్సింగ్

ఖతార్ గగనతలంలో అమెరికా గ్యాస్ స్టేషన్ మిస్సింగ్

శ్చిమాసియా ఘర్షణల సమయంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. ఆ దేశ మిలిటరీ విమానాలకు ఎగిరే గ్యాస్ స్టేషన్‌గా పనిచేసే బోయింగ్ కెసి135 స్ట్రాటోట్యాంకర్ ఖతార్ గగనతలంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్‌దఫ్రా ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన ఈ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్టు ఇరాన్ మీడియా సంస్థ పేర్కొంది. అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి కోడ్‌ను ప్రసారం చేస్తారని పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అక్కడ మోహరించిన విమానాలకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు

ఈ ట్యాంకర్‌ను అమెరికా సైన్యం ఉపయోగిస్తోంది. దీనివల్ల ఫైటర్ జెట్స్ , బాంబర్లు , ఇతర సైనిక విమానాలు ఎక్కువ గంటలు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. తాజాగా ఈ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు యత్నిస్తోన్న సమయంలో కొద్దిసేపు గుండ్రంగా తిరిగినట్టు ఫైట్‌రాడార్ 24 డేటాలో కనిపించింది. అయితే అది ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందో మాత్రం తెలియరాలేదు. అలాగే ఇరాన్‌అమెరికా ఉద్రిక్తతలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా ? అనేది కూడా స్పష్టత లేదు. తమ ప్రమేయంపై ఇరాన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu