Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొంపముంచిన డ్యాన్స్... వివాహం రద్దు చేసుకున్న వధువు

కొంపముంచిన డ్యాన్స్... వివాహం రద్దు చేసుకున్న వధువు

మరావతి: పెళ్లి భరత్ జరుగుతుండగా వధువు డ్యాన్ చేయవద్దని వరుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చిన్నగానిపల్లికి చెందిన యువకుడు, తురిమెళ్ల గ్రామానికి చెందిన యువతితో పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శనివారం రాత్రి వధువుతో పాటు కుటుంబ సభ్యులు చిన్నగానిపల్లి గ్రామానికి వెళ్లారు.

వధూవరులను వాహనం ఎక్కించి బంధువులు ఊరేగింపు ప్రారంభించారు. బంధువులు సంతోషంగా కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. అదే సమయంలో బంధువులు, స్నేహితులు వధూవరులను డ్యాన్స్ చేయాలని కోరారు. వరుడు తాను డ్యాన్స్ చేయనని ఖరాఖండిగా చెప్పాడు.

వధువు డ్యాన్స్ చేయడానికి సిద్దపడుతుండగా వద్దని హెచ్చరించాడు. వధువు డ్యాన్స్ చేయడానికి వీల్లేదని కోపంతో చెప్పడంతో ఆమె బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పెళ్లికి ముందు ఇలా ఉంటే పెళ్లి అయిన తరువాత తన కూతురు పరిస్థితి ఏంటని తండ్రి వెంటనే వివాహ వేడుకను రద్దు చేశాడు. పెళ్లి ఆగిపోవడంతో ఇరువైపుల కట్నకానుకలు లావాదేవీలు సెటిల్ చేసుకున్నారు. వరుడు కుటుంబ సభ్యుల భారీగా ఖర్చు చేయడంతో వారు లబోదిబోమంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu