Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త లుక్‌తో రాబోతున్న టయోటా హైలక్స్..తొలి టీజర్ లాంచ్..!

కొత్త లుక్‌తో రాబోతున్న టయోటా హైలక్స్..తొలి టీజర్ లాంచ్..!

పాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా తన నెక్స్ట్ జనరేషన్ టయోటా హైలక్స్ పికప్ ట్రక్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఈ కొత్త హైలక్స్ 2026 జూలై 28న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఆవిష్కరించబడనుంది. తాజా డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ మార్కెట్లోకి రానుండటంతో ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

కొత్త డిజైన్‌: విడుదల చేసిన టీజర్‌లో కొత్త టయోటా హైలక్స్ ఆరెంజ్, బ్రాంజ్ రంగులో కనిపిస్తోంది. ముందు భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్, హనీకాంబ్ డిజైన్ సెంటర్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హెడ్‌లైట్ల మధ్యలో ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ ట్రిమ్‌పై పెద్ద అక్షరాల్లో టయోటా లోగోను అమర్చారు. పూర్తి డిజైన్‌ను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా, కొత్త మోడల్ మరింత బలమైన, ఆధునిక రూపాన్ని సంతరించుకున్నట్లు టీజర్ సూచిస్తోంది.

ఇంటీరియర్‌: భారత్‌లో విడుదలయ్యే టయోటా హైలక్స్ ఇంటీరియర్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా చూపించలేదు. అయితే, గ్లోబల్ మోడల్ తరహాలో డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్ కొనసాగనుంది. ఇందులో లెదర్‌తో కప్పిన స్టీరింగ్ వీల్‌పై పెద్ద టయోటా లోగో ఉంటుంది. అలాగే 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించే అవకాశం ఉంది. డ్రైవర్ డిస్‌ప్లేలో నాలుగు వేర్వేరు డిస్‌ప్లే థీమ్‌లు ఉండగా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ టయోటా స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీపై పనిచేస్తుంది.

భారతీయ మోడల్‌లో ఉండే ఫీచర్లు: భారత్‌లో వచ్చే టయోటా హైలక్స్ లో వైర్‌లెస్ అయేలే కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యుయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సరౌండ్ వ్యూ కెమెరా, అదనపు స్టోరేజ్ క్యూబీలు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా HVAC నియంత్రణలు, ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సెట్టింగ్స్ కోసం ప్రత్యేక బటన్ లు, సాంప్రదాయ స్విచ్‌గియర్‌ను కూడా అందించనున్నారు.

ఇంజిన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు: కొత్త హైలక్స్ ఇంజిన్ వివరాలను టయోటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుత మోడల్‌లో ఉన్న 2.8 లీటర్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇంజిన్ 240 హెచ్‌పీ పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్‌తో పాటు ప్రస్తుతం ఉన్న గేర్‌బాక్స్ ఎంపికలు కూడా కొనసాగవచ్చని అంచనా.

విడుదల ఎప్పుడు?: టయోటా కొత్త తరం హైలక్స్ను జూలై 28, 2026న అధికారికంగా ఆవిష్కరించనుంది. ఆ సందర్భంగా పూర్తి డిజైన్, సాంకేతిక వివరాలు, అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. భారత్‌లో ఈ పికప్ ట్రక్ విడుదలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu