Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్: వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం జిల్లా కలెక్టర్ జె.నివాస్ చేశారు. పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిందని, దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు. డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేని ఎడల ఆ నీటి వత్తిడి ఇతర గేట్ల పై పడే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నది. ఈ దృష్ట్యా అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా,ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.

వాగులు, వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు కలెక్టర్ జె.నివాస్ కోరారు.

People in flood prone areas should be vigilant

People in flood prone areas should be vigilant

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu