హైదరాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. వినాయక మండపం వద్ద కార్తీక్ అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రేమ వ్యవహారంలో కార్తీక్ తన స్నేహితుడికి సాయం చేయడంతోనే హత్య చేసినట్టు సమాచారం.
యువతి ప్రియుడితో వెళ్లిపోవడంలో కార్తీక్ సాయం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు పగ పెంచుకొని ఇప్పుడు హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

