హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది.
లారీ కింద కారు ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

