ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ర శేరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో దీపికాతో పాటు.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికలు కూడ హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్. అయితే ఓ బ్యూటీ ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ని మిస్ చేసుకుందట. ఆమె ఎవరో కాదు.. రీసెంట్ సెన్సేషన్ ప్రీతి ముకుందన్.
ఈ విషయన్ని ప్రీతి గతంలో చెప్పి సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు అట్లీ స్పందించారు. 'హృదయం మురళి' సినిమా ట్రైటర్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ''నేను ప్రీతి నటనకు పెద్ద అభిమానిని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ రాకాలో ఓ కీలక పాత్ర కోసం ఆమెనే సంప్రదించాను. అప్పటికే ఆమె బిజీగా ఉండటంతో మాకు డేట్స్ కేటాయించలేకపోయింది. దీంతో ఈ ప్రాజెక్టును ఆమె వదులుకోవాల్సి వచ్చింది'' అని చెప్పారు. ప్రీతి వదులుకున్న పాత్రను మలయాళ నటి ఫెమినా జార్జ్‌కు ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఆ పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.

