Dailyhunt
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సిఐ

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సిఐ

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ సిఐ ఎసిబికి చిక్కిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో సిఐ (ఎస్‌హెచ్‌ఒ) కనకయ్య లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు.

స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో సిఐ కనకయ్య లంచం డిమాండ్ చేశారు. దీంతో అవాక్కయిన బాధితుడు ఈ విషయమై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నందుకున్న ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. స్టేషన్ బెయిల్ కోసం రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా కనకయ్యను

రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు అధికారులు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్‌లోనే కనకయ్యను అధికారులు పట్టుకున్నారు. స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఎసిబి అధికారులను గమనించిన కనకయ్య అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు సమాచారం. ఎట్టకేలకు అతనిని అదుపు లోకి తీసు కున్న అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu