Seethakka comments on Sudeer reddy
Seethakka comments on Sudeer reddyహైదరాబాద్: సొంత పార్టీ మహిళా ఎంఎల్‌ఎల పట్ల బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
అసెంబ్లీ వద్ద ఘటనపై మంత్రి సీతక్క వీడియో విడుదల చేసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా ఎంఎల్‌ఎలతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, కోవా లక్ష్మిని గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వెనుక నుంచి తోశారని తెలియజేశారు. మహిళా ఎంఎల్‌ఎలను నెట్టుకుంటూ గంగుల కమలాకర్ ముందుకు వచ్చారని, ఇద్దరు మహిళా ఎంఎల్‌ఎల మధ్యలోకి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తాకుకుంటూ ఎలా వస్తారని సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎంఎల్‌ఎల మధ్యకు చొరబడాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి ఏముందని అడిగారు. మహిళా ఎంఎల్‌ఎలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పడ్డారని, కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ చేయి వేయడం ఏంటని నిలదీశారు. నవీన్ రెడ్డి నెడుతూ వెళ్తున్న సందర్భంలో మహిళా ఎంఎల్‌ఎలు అరిచారని సీతక్క గుర్తు చేశారు.

