Dailyhunt
మంచి కథతో 'సతీ లీలావతి'

మంచి కథతో 'సతీ లీలావతి'

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సతీ లీలావతి'. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆరట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనస్సులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. "సతీ లీలావతి' కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య, ఉదయ్ మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. 'సతీ లీలావతి' అద్భుతంగా వచ్చింది'అని అన్నారు.తాతినేని సత్య మాట్లాడుతూ ..

''మా 'సతీ లీలావతి' ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ కి థాంక్స్. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను"అని తెలిపారు. ఈ కార్యక్రమం లో దేవ్ మోహన్, నాగ మోహన్, జీవన్ బొటిమల, బినేంద్ర మీనన్, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu