హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉంది. కొండా దంపతులు తన అనుచరులతో చర్చించి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. అధిష్ఠానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నారు.
బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై అనుచరులతో చర్చ జరుపనున్నారు. కొండా సురేఖను రాజీనామా చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. గురువారం సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నారు.

