Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ జిల్లా భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

మెదక్ జిల్లా భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Telangana Police

మెదక్ జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పెద్దశంకరంపేట మండలం చిలపల్లిలో ఈ నెల 14, 15న చోరీలు జరిగాయి. తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో భారీగా బంగారం, వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు.

5 ఇళ్లలో కలిపి కిలోకు పైగా బంగారం, 2.5 కిలోల వెండి చోరీ జరిగింది. చోరీ కేసులో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 929 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రోడ్ల పక్కన తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బైకులపై తిరుగుతూ గ్రామ శివారులోని ఇళ్లలో ఈ ముఠా దొంగతనాలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు జాదవ్ జయరాంపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu