Dailyhunt
మెట్రో రెండో దశ డివిఆర్‌ను వెంటనే ఆమోదించండి: కేంద్ర మంత్రితో సిఎం

మెట్రో రెండో దశ డివిఆర్‌ను వెంటనే ఆమోదించండి: కేంద్ర మంత్రితో సిఎం

Revanth Reddy

న్యూఢిల్లీ: సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. పర్యటనలో భాగంగా రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు.

దాదాపు అరగంటపాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్టు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రెండో దశ డిపిఆర్‌ను వెంటనే ఆమోదించాలని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌ను ఫే-3 కింద చేపట్టాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu