ఓటిటిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హిందీ వెబ్ సిరీస్ మీర్జాపూర్.. ఇప్పుడు థియేటర్లలోనూ తన హవా కొనసాగిస్తోంది. 'మీర్జాపూర్: ది మూవీ' పేరుతో 2026 సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది.
అమెజాన్ MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పునీత్ కృష్ణ రచన సహకారం అందిచగా.. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ తోపాటు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
'మీర్జాపూర్: ది మూవీ' ఇప్పటివరకు భారత్ లో రూ.149.97 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా... విదేశాల్లో రూ.27 కోట్లుగా కలెక్ట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 176.97 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. త్వరలోనే ఈమూవీ రూ.200 కోట్ల క్లబ్ చేరి సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

