మన తెలంగాణ: ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని మోత్కూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు అన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని గురువారం మోత్కూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు "వృక్షాబంధన్" కార్యక్రమాన్ని వినూత్నంగా జరుపుకున్నారు.
పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లకు రాఖీలు కట్టి వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చెట్లు మనకు ప్రాణవాయువు తోపాటు జీవవైవిద్యాన్ని కల్పించి మానవ మనుగడకు దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు బాల్యం నుండే ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని సాయి చైతన్య పాఠశాల లో గురువారం ముందస్తుగా రాఖీ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థినిలు విద్యార్థుల కు రాఖీ లు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు బి. రవీందర్ రెడ్డి, బి. కవిత,ఉపాధ్యాయులు వసీమ, సైదులు,పాషా, మల్లేష్,వసంత,నిఖిత, లక్ష్మీ,మహేందర్,కవిత,అఖిల,ఆలేఖ్య, రాజేశ్వరి,రజియా సుల్తానా, నవిత ,విద్యార్థులు పాల్గొన్నారు.

