Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడు కరవు మండలాలకు రూ.150 కోట్లు

మూడు కరవు మండలాలకు రూ.150 కోట్లు

మనతెలంగాణ/ హైదరాబాద్: కరువు పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా ప్రజలు, రైతులు తట్టుకునేలా ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత నివారణ చర్య లు చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ప్రతి గ్రామం లో గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, స్థానిక అ వసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిఎం వంత్ రెడ్డి సూచనల మేరకు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రా జెక్టును చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు ప్రభావానికి గురవుతున్న ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజి క, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు, రైతు కుటుంబాల జీవనోపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌డిఎఫ్) సహకారంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు.

శనివారం సచివాలయంలో వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరువు నిరోధక వ్యవసాయ విధానం అమలు, కరువు పీడిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రతిపాదిత ప్రాజెక్టు కార్యాచరణ, నిధుల సమర్థ వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల, నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం ప్రాజెక్టుకు ప్రకృతి విపత్తుల శాఖ పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయడానికి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు, వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.కరువు నివారణ ప్రాజెక్టు అమల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఎంపిక చేసిన మండలాల్లోని ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లక్ష్యాన్ని చేరేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరుతాయని పేర్కొన్నారు.కరువు ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపై కూడా పడుతుందని మంత్రి తెలిపారు. అందువల్ల ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా, స్థానిక పరిస్థితులకు తగిన శాశ్వత పరిష్కారాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని మంత్రి స్పష్టం చేశారు. నిధుల వినియోగం, పనుల ఎంపిక, అమలు విధానం, క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కేవలం నిధుల ఖర్చు, పనుల పూర్తితోనే ప్రాజెక్టు విజయాన్ని అంచనా వేయకుండా, ప్రజలకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరింది, కరువు సమస్యను పరిష్కరించడంలో ఎంత పురోగతి సాధించామన్నది ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎన్. గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu