Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు : పొంగులేటి

మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు : పొంగులేటి

హైదరాబాద్: హైదరాబాద్‌ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించి లబ్ధిదారులకు అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. రెండో, మూడో విడత నిర్మాణాల కోసం కూడా ముందుగానే భూములను గుర్తించాలని సూచించారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి ఇందిరమ్మ టవర్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణాలకు అవసరమైన భూముల గుర్తింపు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పొంగులేటి ఆదేశించారు. ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహించే లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. తద్వారా ఎంపిక ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసంపెరుగుతుందని పేర్కొన్నారు.ఇందిరమ్మ టవర్ల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu