Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగిసిన మూడో రోజు ఆట.. ఇండియా-ఎ ఆధిక్యం ఎంతంటే..

ముగిసిన మూడో రోజు ఆట.. ఇండియా-ఎ ఆధిక్యం ఎంతంటే..

India-A

గాలె: శ్రీలంక-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు పూర్తి భారత్‌దే ఆధిపత్యం నడిచింది.

మూడో రోజులు 247/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆటగాళ్లు రెండో వికెట్‌కి 182 పరుగులు జోడించారు. దురదృష్టవశాత్తు దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 168 పరుగులు చేసిన సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో కెప్టెన్ ధృవ్ జురేల్(53) అర్థశతకం సాధించి ఔట్ అయ్యాడు. ఇక షేక్ రషీద్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 51 బంతుల్లో 45 పరుగులు చేసి డగౌట్ చేరాడు. మరోవైపు సారాంశ్ జైట్ నిలకడగా పరుగులు చేస్తూ వచ్చాడు. 137 బంతులు ఎదురుకున్న అతడు 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అకీబ్ నబి దర్ 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 142 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 541 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 175 పరుగుల ఆధిక్యం లభించింది. శ్రీలంక బౌలింగ్‌లో కేశర నువంత 4 వికెట్లు, దిలుమ్ సుదీర 3 వికెట్లు, సహన్ అరచ్చిగే 1 వికెట్ తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu