ఇరు జట్లకూ కీలకమే
నేడు ముంబైతో చెన్నై పోరు
చెన్నై: ఐపిఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు శనివారం జరిగే కీలకంగా మారాయి.
ముంబై మూడు, చెన్నై రెండు విజయాలు మాత్ర మే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడ్డాయి. హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబైకి అవమానకర ఓటమి ఎదురైంది. 243 పరుగుల భారీ లక్ష్యాన్ని సయితం ముంబై కాపాడుకోలేక పోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
ఇలాంటి స్థితిలో చెన్నైతో జరిగే పోరు జట్టుకు సవాల్‌గా మారింది. సన్‌రైజర్స్‌పై ఓపెనర్ రికెల్టన్ విధ్వంసక శతకం సాధించడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. విలక్ జాక్స్, సూర్యకుమార్, హార్దిక్, నమన్ ధిర్ తదితరులతో ముంబై బలంగానే ఉంది.
ఇక చెన్నై కూడా ఈ మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. సమష్టిగా రాణించడంలో సిఎస్‌కె విఫలమవుతోంది. దీంతో జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఈ మ్యాచ్ లలో చెన్నై తరపున మహేంద్ర సింగ్ ధోనీ, ముంబయి తరపున రోహిత్ శర్మ ఆడుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ధోనీ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

