ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు కట్టిన స్థానికులు
మూడు జిల్లాల పరిధిలో 48లక్షల మంది టీకా కోసం ఎదురుచూపులు
నాలుగు రోజుల్లో 2లక్షలమందికి వ్యాక్సిన్ పంపిణీ
సెకండ్ డోసు గురించి ఆందోళన అవసరంలేదు
కొవిషీల్డ్ సరిపడా నిల్వలు ఉన్నాయంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో కరోనా వ్యా క్సిన్ సెకండ్ డోసు పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. గత నాలుగు రోజులనుంచి కోవిషీల్డ్ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసి మొదటి డోసు తీసుకుని సెకం డ్ డోసు కావాల్సిన వారికి వైద్య సిబ్బంది వేస్తున్నారు. పలు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద స్థానిక ప్రజలు బారులు క ట్టి సకాలంలో టీకా వేసేందుకు ముందుకు వస్తున్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
కొవాగ్జిన్ కోసం ఆరోగ్య కేంద్రాల చుట్టూ
కొంతమం ది మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకోవడంతో సెకండ్ డో సు కూడా అదే కావాలి, అందుకోసం నగరంలో టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యాదికారుల మా త్రం ప్రస్తుతం కొవిషీల్డ్ అందుబాటులో ఉందని, కోవాగ్జిన్ మాత్రం లేదని, కొన్ని రోజుల పాటు ఎదురుచూపు లు తప్పవంటున్నారు. ఎంతమందికి అవసరమనే వివరాలు సేకరించి ఆగస్టు మొదటి వారంలో వచ్చేలా రాష్ట్ర వైద్యాదికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఆరోగ్య శాఖ పేర్కొంటుంది.

