షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ
ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది : ఎస్‌ఇసి పార్థసారధి
కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి
పోలింగ్‌కు 72గంటల ముందే ప్రచారం నిలిపివేత
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉధృతి దృష్టా రాష్ట్రంలో రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా..? అన్న అంశంపై ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి స్పష్టం చేశౠరు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అ మలు చేస్తామని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ఎస్‌ఇసికి తెలిపింది.
No change in Municipal elections schedule says SEC

