Dailyhunt
మున్సిపోల్ బరిలో 1239

మున్సిపోల్ బరిలో 1239

పురపోరుకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువా రంతో ముగిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్(జిడబ్ల్యూఎంసి) ఎన్నికల్లో 66 డివిజన్లకు 1,063 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 629 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 434 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే ఖమ్మం కార్పోరే షన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, 522 నామినేష న్లు దాఖలుగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 251 మంది పోటీలో నిలిచారు. సిద్ధిపేట మున్సిపాలి టీలో 43 వార్డులకు 575 నామినేషన్లు దాఖలు కాగా, ఉపసంహరణ తర్వాత 236 మంది పోటీలో మిగిలారు.

అదేవిధంగా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వా ర్డులకు 149 నామినేషన్లు రాగా, చివరగా 66 మంది పోటీలో నిలిచారు.

నకిరేకల్‌లో 20 వార్డులకు 305 నామినేషన్లు రాగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 93 మంది పోటీలో నిలిచారు. జడ్చర్లలో 27 వార్డులకు 241 నామినేషన్లు దాఖలు కాగా, చివరగా పోటీలో 112 మంది మిగిలారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 85 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 47 మంది పోటీలో నిలిచారు. ఎన్నికలు జరుగనున్న రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలలో నామినేషన్ల ఉపసంహరణ ము గిసిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. కొవిడ్ ఆంక్షలు నేపథ్యంలో సమయ పాల న పాటిస్తూ అభ్యర్థులు ప్రచారం నిర్వహించనున్నారు.

30న ఎన్నికలు
వరంగల్, కార్పొరేషన్లతో సిద్ధిపేట, జడ్చ ర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఈ నెల 15న నోటిఫికేషన్ వెలువడగా,16న నామినేషన్లు ప్రారంభయ్యాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగియగా, నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో ముగిసింది. మే 3న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. సిద్దిపేట లో 43 వార్డులు, అచ్చంపేటలో 20 వార్డులు, నకిరేకల్ వార్డులు, వార్డులు, కొత్తూరు మున్సిపా లిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.

Municipal election nominations in ts has closed

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu