Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మురుగన్ ముఠా గుట్టురట్టు

మురుగన్ ముఠా గుట్టురట్టు

న తెలంగాణ/హైదరాబాద్: పసిపిల్లల అక్రమ రవాణా ముఠాను గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా నాయకుడు మురుగన్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశా రు.

ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ ముఠా పసిపిల్లల విక్రయాలకు సంబంధించి సమాచారంతో గుజరాత్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇలా ఉండగా ఆదిలాబాద్‌లో గత సంవత్సరం ఇటుకల పరిశ్రమలో కార్మికుడిగా పని చేసిన మురుగన్, ఏడాదిలోనే పిల్లల అక్రమ రవాణా ముఠాను ఏర్పాటు చేసి కీలకంగా మారాడు. పిల్లల విక్రయానికి సంబంధించి గత సంవత్స రం హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ప రిధిలోని నమోదైన ఒక కేసులో మురుగన్ పేరు బయటపడింది. ఇదే కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తరువాత జులైలో విడుదలైన మురుగన్ దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.

వారం రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మురుగన్‌తో పాటు ఆ ముఠాలో సభ్యులుగా ఉన్న కా సారపు తిరుపతి, కాసారపు మల్లయ్యలను గుజరాత్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని విచారించగా ముఠాలో మరి కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరో వైపు మురుగన్ భార్య కృష్ణవేణి కూడా ఇదే నేరాలకు సంబంధించి మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు గుజరాత్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ముఠా 25 మంది పిల్లల విక్రయాలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అందులో ప్రధాన సూత్రధారుగా ఉన్న మురగన్ భా ర్య కృష్ణవేణితో పాటు అమూల్య పేర్లు బయటకు వచ్చాయి. కాగా, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల స మాచారం. ఈ ముఠాలోని సభ్యుల సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లకు మురగన్ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో పోలీసులు బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.

ఐవిఎఫ్ కేంద్రాలే అడ్డగా..

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటకు చెందిన సోమ అమూల్య, సూరారం ప్రాంతానికి చెందిన కృష్టవేణి, ఇస్మాయిల్ అనే వ్యక్తితో కలిసి పిల్లల అక్రమ రవాణా ద్వారా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. వీరు నగరంలోని ఐవిఎఫ్ కేంద్రాలే అడ్డగా ఏర్పరచుకుని సంతాపం లేని దంపతులే లక్షంగా పసిపిల్లల విక్రయాలకు తెరలేపారు. ఈ క్రమంలో వీరితో బోదాసు నాగరాజు అలియాస్ మురగన్ అనే వ్యక్తి చేతులు కలిపి ఈ నెట్ వర్క్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కలిసి గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పిల్లల విక్రయాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. ఈ ముఠా సభ్యులు పలు మార్లు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టినా, తిరిగి బయటకు వచ్చాక అవే నేరాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఒక జంట తమకు పిల్లాడు కావాలని ఈ ముఠాను సంప్రదించగా, వారు కిడ్నాప్‌నకు పాల్పడడంతో గుజరాత్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆపరేషన్ దేవ్ పేరుతో దర్యాప్తు నిర్వహించగా మురుగన్ ముఠా గుట్టు రట్టయ్యింది.

మురుగన్ నేర చరిత్ర

ఈ నెల 6వ తేదీన దేవ్ అనే నాలుగేళ్ల బాలుడు(గుజరాత్‌లోని బనాస్‌కాంత జిల్లా) కిడ్నాప్‌కు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేసి కిడ్నాపింగ్ ముఠా బారినుండి బాలుడిని రక్షించారు. ఆ బాలుడిని మరో ముఠాకు విక్రయించే సందర్భంగా మురగన్ పేరు బయటపడింది. దీంతో మురగన్ ముఠా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇదే తరహా నేరాలు ఏమయినా నేరాలు చేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. దీనికి గాను కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో పరిశోధించగా మురుగన్ అలియాస్ బోగాసు నాగరాజు పేరుతో నేరాలకు పాల్పడినట్లు బయటపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu