పఠాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో టైర్ రిట్రేడింగ్ చేస్తున్న వర్క్ షాప్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
వర్క్ షాప్ ను సందర్శించడానికి వచ్చిన వ్యక్తి డై బ్లాస్ట్ తాకడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

