Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా అండాలను భద్రపరుచుకోవాల్సి వచ్చింది: కృతి సనన్

నా అండాలను భద్రపరుచుకోవాల్సి వచ్చింది: కృతి సనన్

హైదరాబాద్: కాక్‌టెయిల్ మూవీలో కృతి సనన్ నటించింది. మిమి అనే గ్లామర్ పాత్రలో కృతి మెరిసింది. పాడ్‌కాస్ట్‌లో ఇష్టాగోష్టిగా ఆమె మాట్లాడారు. కాక్‌టెయిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ బరువు పెరగాలని తనకు చెప్పాడని, మిమి లాంటి పాత్రలు చేస్తున్నప్పుడు హార్మోన్లకు సంబంధించిన ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందని, తాత్కాలిక కడుపు ఉబ్బరంతో పాటు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసింది.

బరువు పెరగడంతో అండాశయంపై కూడా ప్రభావం చూపిస్తుందని తెలిసిందని, వెంటనే అండాలను భద్రపరచుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నానన్నారు. అందుకే చాలా మంది అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుచుకుంటున్నారని వివరించారు. దీంతో ఆరోగ్యంగా ఉన్నప్పుడే అండాలను ఫ్రీజింగ్ చేసుకున్నానని వెల్లడించారు. మిమి పాత్ర గురించి చెప్పాలంటే డబ్బుల కోసం మిమి రాథోడ్ అద్దె గర్భం ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది.

అమెరికన్ జంట నుంచి అండం, స్పెర్మ్‌తో మిమి అద్దె గర్భం దాలుస్తుంది. తరువాత ఆ బిడ్డను తీసుకునేందుకు అమెరికన్ జంట ముందుకు రాకపోవడంతో మిమి ఏం చేసింది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే సినిమా చూస్తే తెలుస్తుంది. అసలు ఆమె బిడ్డకు జన్మనిచ్చిందా? లేదా అనే కోణం సినిమా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu