Anantha Sriram
భీమవరం: గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పికి వినతిపత్రం అందించారు.
హరి రామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. స్థల వివాదం కోర్టులో ఉందని.. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో అనంత శ్రీరామ్ కోరారు.

