Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాన్న కొడతారేమో అని ఆ విషయంలో అబద్ధం చెప్పా: రామ్ చరణ్

నాన్న కొడతారేమో అని ఆ విషయంలో అబద్ధం చెప్పా: రామ్ చరణ్

Ram Charan

రామ్‌ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పెద్ది'. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డాడు.

కొద్ది రోజుల క్రితం సెట్స్‌కి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. తన కొడుకు పడుతున్న కష్టాన్ని చూడలేక.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి కావడంతో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. గ్యాప్ లేకుండా.. ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. సినిమా విశేషాలతో పాటు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.

అయితే తన తండ్రి చిరంజీవికి చెప్పిన ఓ అబద్ధాన్ని చరణ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచి బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదని.. లోకజ్ఞానం లేకుండానే పెరిగానని చరణ్ అన్నారు. ''మాఇంట్లో సినిమా వాతావరణం ఉండేది కాదు.సినిమా మ్యాగజైన్లు, అవార్డులు అన్నీ నాన్న ఆఫీసులోనే ఉండేవి. ఒకవేళ ఎప్పుడైనా ఒక సినిమా మ్యాగజైన్ కనిపించినా ముట్టుకోవాలంటే భయమేసేది. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కానీ, ఆ విషయం బయటకు చెప్పే ధైర్యం లేదు. నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా.. ఏమవ్వాలనుకుంటున్నావు? అని నాన్న అడిగాడు. ఆయన మెప్పు పొందేందుకు మెకానికల్ ఇంజనీర్ అవుతానని చెప్పాను'' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu