తమ బీఆర్‌ఎస్ ప్రభు త్వం పదేండ్ల పాలనలో హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు నిర్మించిందని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. కానీ, కాంగ్రె స్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కూ డా కట్టలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించినా నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాలు విసిరారు. కట్టకపోగా.. మూసీ అ భివృద్ధి పేరిట ఇళ్లను కూల్చివేస్తుందని ఆవేదన వ్య క్తం చేశారు. 2028లో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, రాగా నే 24 గంటలు నీటి సరఫరా చేస్తామని ఆయన అన్నారు. సోమవారం కూ కట్‌పల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల
విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎన్‌కేఎన్‌ఆర్ గా ర్డెన్‌లో జరిగింది. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమో దు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓటర్ల నమో దు, వడపోత కా ర్యక్రమంపై కేటీఆర్ పవర్ పా యింట్ ప్రజంటేషన్ చేశారు. 24 ఏండ్ల తరువాత దేశంలో ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, ఫేక్ ఓట్లను తొలగించేవిధంగా చూసుకోవాలని సూచించారు. వేర్వేరు చోట్ల ఓట్లు కలిగినవారు ఒకేచోట ఓటు హక్కు కలిగి ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు.
రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ పాలన
రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ పాలన కొనసాగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం అలవికాని హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కె.నవీన్‌రావు, శంభీపూర్‌రాజు, రాగిడి లకా్ష్మరెడ్డి, సభ్య త్వ నమోదు ఇంచార్జి గజ్జెల నగేష్, నియోజకవర్గం బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, తదితరులు పాల్గొన్నారు.

