Dailyhunt
నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీ మారే ప్రసక్తే లేదు: ఈటల

నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీ మారే ప్రసక్తే లేదు: ఈటల

శామీర్‌పేట: మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

''ఎలాంటి తప్పు చేయకపోయినా మెడలు పట్టి బయటకు గెంటేసిన బిఆర్ఎస్‌ పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సుంభం కాదు'' అని అన్నారు.

''నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బిఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికాల బలంతో వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం నాకు బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదు'' అని ఈటల పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu